సీఎం సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:56 PM
అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి ఈనెల 9వ తేదీన నర్సింగోలులో జరగనున్న సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.
అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి
కలెక్టర్ రాజాబాబు, ఏపీ మారిటైంబోర్డు చైర్మన్ సత్యలతో కలిసి సభావేదిక, హెలిప్యాడ్ స్థల పరిశీలన
నర్సింగోలు(కొండపి), అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి) : అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి ఈనెల 9వ తేదీన నర్సింగోలులో జరగనున్న సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. మంగళవారం ఉదయం జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో కలెక్టర్ రాజాబాబు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ సత్యలతో కలిసి సభావేదిక, హెలిప్యాడ్ స్థల పరిశీలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ వివిధ పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకుని సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్, సభావేదిక, భోజన ఏర్పాట్లు తదితర విషయాలపై మంత్రి స్వామి చర్చించారు. ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి దాదాపు 40 వేల మంది వరకు హాజరు కావచ్చన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడి సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని, అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కల్పించాలని చెప్పారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ అధికారులు కమిటీలుగా ఏర్పడి సీఎం సభాస్థలి, హెలిప్యాడ్ ఇతర వసతులను పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవికుమార్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, డీపీవో అనుపమ, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు అధికారి ఎం. వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, డీఏవో శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఈ గోపీ నాయక్, డీఈఈ ఆనందరావు, ఏఈఈ దీప్తి, తహసీల్దార్లు కె. వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాసరావు, ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, చదలవాడ చంద్రశేఖర్, నాయకులు పోటు శ్రీనివాసమురళి, ఏలూరి రాంబాబు, నలమోతు వెంకటేశ్వర్లు, కొమ్మాలపాటి కృష్ణ, రావి నాగేశ్వరరావు, నర్సింగోలు గ్రామ నాయకులు పాతూరి కోటేశ్వరరావు, పాతూరి శ్రీహరి, రామారావు తదితరులు పాల్గొన్నారు.