Share News

విజయోత్సవ సభకు తరలివెళ్లాలి

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:54 PM

జిల్లా కేంద్రం మార్కాపురంలో ఈనెల 17వ తేదీ బుధవారం జరుగనున్న రెండేళ్ల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

విజయోత్సవ సభకు తరలివెళ్లాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం మార్కాపురంలో ఈనెల 17వ తేదీ బుధవారం జరుగనున్న రెండేళ్ల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలోని మార్కెట్‌యార్డులో జరిగే విజయోత్సవ సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని అన్నారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. సభకు తరలివెళ్లే ఏర్పాట్లపై ఆయన నాయకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, మండల, పట్టణ పార్టీల అధ్యక్షుడు షానేషావలి, మోహన్‌రెడ్డి, బండ్లమూడి ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, మార్తాల సుబ్బారెడ్డి, యోగానంద్‌, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్లా బాలీశ్వరయ్య, టీడీపీ నాయకులు కొత్తపల్లి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 10:54 PM