స్థానికసంస్థల ఎన్నికల్లో విజయాన్ని అందుకోవాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:59 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొని ఎం పీపీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థుల ఖా తాలో వేసుకోవాలని నియోజకర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.
తాళ్లూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొని ఎం పీపీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థుల ఖా తాలో వేసుకోవాలని నియోజకర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. పదవీకాలం ముగిసిన ఎం పీపీ తాటికొండ శ్రీను, నాగలక్ష్మి దంపతులు, జడ్పీటీసీ సభ్యుడు మారం వెం కటరెడ్డి, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, రమాదేవి దంపతులను, ఎంపీటీసీ సరస్వతీ, ప్రభాకర్‌రెడ్డి దంపతులను, మాజీ సర్పంచ్ పి.ఎ్‌స.శ్రీకాంత్‌రెడ్డిలను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిలలిత్‌సాగర్ దంపతులు బుధవారం సత్కరించారు.
వ్యవసాయ యంత్రాల పరికరాలను అద్దెకిచ్చే భవనం ప్రారంభం
రతాళ్లూరులోని వెలుగుపాజెక్ట్, డీఆర్‌డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వ్యవసాయయంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాన్ని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నారాయణరావు, ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటేశ్వరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బి.ఓబుల్‌రెడ్డి, దర్శి ఏఎంసీ చైర్మన్ డిఎన్ సుబ్బారావు, టీడీపీ నాయకులు మానం రమే్‌షబాబు, తూము శివనాగిరెడ్డి, వి.సుబ్బయ్య, ఐ.వి.రమణారెడ్డి, పిన్నిక రమేష్, జి.వేణుబాబు, ఐ.సుబ్బారెడ్డి, రాచకొండ వెంకట్రావు, రామకోటిరెడ్డి, విద్యాసాగర్, కళ్యాణ్‌చక్రవర్తి, హనుమారెడ్డి,ఖాసీంసైదా,ఎంఎంఎ్‌సఅధ్యక్షురాలుఎం.సుజాత, పి. రాజు, ఎఫ్రయిమ్, ఎన్.శ్రీను మండల స్థాయి అధికారులు తహసీల్దార్ బి.వి.రమణారావు, ఎంపీడీవో పి అజిత , వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఏపీఎం దేవరాజ్,రైతులు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.