Share News

జలకొండ

ABN , Publish Date - Sep 03 , 2026 | 02:54 AM

నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల వేగం పెరిగింది. తొలిరోజు 500 క్యూసెక్కుల విడుదలతో ప్రారంభించిన అధికారులు బుధవారం 5వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో కలనూతల, సుంకేసుల వైపు జలాలు పరుగులు పెడుతున్నాయి.

జలకొండ
నల్లమల రిజర్వాయర్‌లోకి చేరిన నీరు

నల్లమల రిజర్వాయర్‌కు చేరుతున్న కృష్ణా నీరు

వెలిగొండ ద్వారా 5 వేల క్యూసెక్కులు సరఫరా

మార్కాపురం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల వేగం పెరిగింది. తొలిరోజు 500 క్యూసెక్కుల విడుదలతో ప్రారంభించిన అధికారులు బుధవారం 5వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో కలనూతల, సుంకేసుల వైపు జలాలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం గొట్టిపడియ డ్యామ్‌ సమీపంలోకి చేరాయి. నీటిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముంపు గ్రామాల వైపు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున దాదాపు 24 రోజులపాటు నీటిని విడుదల చేయాల్సి ఉంటుం దని, మొత్తం 10.7 టీఎంసీలతో నల్లమల సాగర్‌ను నింపుతామని ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - Sep 03 , 2026 | 02:54 AM