నల్లమల సాగర్‌కు జలకళ
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:00 AM
శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్ రిజర్వాయర్ కళకళలాడుతోంది. శుక్రవారం నాటికి 3.24 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
వెలిగొండ ద్వారా 3.24 టీఎంసీల కృష్ణా జలాలు చేరిక
మార్కాపురం, సెప్టెంబరు 11 (ఆంధ్ర జ్యోతి): శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్ రిజర్వాయర్ కళకళలాడుతోంది. శుక్రవారం నాటికి 3.24 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. గతనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజె క్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం విదితమే. తొలిరోజు 500 క్యూసెక్కులతో ప్రారంభించి క్రమేపీ నీటి పరిమాణాన్ని 5వేల క్యూసెక్కులకు పెంచారు. రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున కొల్లంవాగు వద్ద హెడ్‌రెగ్యులేటర్ నుంచి విడుదలవుతున్న నీరు టన్నెళ్ల ద్వారా ఫీడర్ కాలువలో ప్రవహిస్తూ నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు వెళ్తోంది. శుక్రవారం నాటికి 3.24 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.