Share News

చీమకుర్తిలో రేటు హీటు

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:55 AM

జిల్లాలో ఆదివారం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలలో ఒకటైన చీమకుర్తిలో శని వారం నిశరాత్రి రేటు హీటు ఆరంభమైంది. ఒకవైపు కొన్ని మున్సిపాలిటీలలో వైసీపీ శని వారం మధ్యాహ్నం నుంచే చేతులెత్తేయగా చీమకుర్తిలో మాత్రం ఆపార్టీ నేతలు భారీ ప్రలోభాలకు శ్రీకారం పలికారు.

చీమకుర్తిలో రేటు హీటు

ఓటు ధర రూ.5వేలకు పెంచిన వైసీపీ

టీడీపీ నాయకత్వంపై అధిష్ఠానం ఒత్తిడి

డబ్బు పంపిణీదారులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో ఆదివారం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలలో ఒకటైన చీమకుర్తిలో శని వారం నిశరాత్రి రేటు హీటు ఆరంభమైంది. ఒకవైపు కొన్ని మున్సిపాలిటీలలో వైసీపీ శని వారం మధ్యాహ్నం నుంచే చేతులెత్తేయగా చీమకుర్తిలో మాత్రం ఆపార్టీ నేతలు భారీ ప్రలోభాలకు శ్రీకారం పలికారు. చీమకుర్తి లోని ఒకప్రాంతంలో ఓటు రేటును రూ.5వేల కు చేర్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన టీడీ పీ అధిష్ఠానం స్థానిక నాయకులను అప్రమ త్తం చేసింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేత లు బజారుకెక్కి ఓట్ల కొనుగోలు వ్యవహా రంపై చర్చించుకోవడం, వాగ్వివాదాలకు దిగ డం, గెలుపోటములపై పందేలు కాసుకోవ డం వంటి విషయాలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు డబ్బు పంపిణీ చేస్తున్న వైసీపీ శ్రేణులను గుర్తించి అదుపులోకి తీసుకునే చర్యలను ప్రారంభించారు. కొందరు వైసీపీ నాయకులను స్టేషన్‌కు తీసుకుచ్చి బైండోవర్‌ చేసి పంపించారు. ప్రధానంగా పోటీలో ఉన్న వారిలో, అలాగే ఏజెంట్లుగా కూర్చోబోయే వారిలో అనుమానితులను పిలిపించుకుని బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఒకవైపు ఇతర మున్సిపాలిటీలలో పరిస్థితి కూటమి పార్టీలకు అనుకూలంగా మారిన నేపథ్యంలో చీమకుర్తిలోనే వైసీపీ శ్రేణుల హడావుడి పెరగడం గమనార్హం. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టరు శివప్రసాద్‌రెడ్డికి చీమకుర్తి స్వగ్రామం. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహించే దర్శి నియోజకవర్గంలో ఎదురైన సమస్యలతో ముందుకుపోలేక మున్సిపాలిటీ, ఎంపీటీసీలకు నామినేషన్ల దాఖలులోనే చేదు అనుభవానికి గురయ్యారు. దీంతో చీమకుర్తిలోని వైసీపీ శ్రేణులను మరీ ముఖ్యంగా ఒక సామాజికవర్గం వారిని ఐక్యం చేసి ముందుకు దూకారు. టీడీపీలో ఉన్న చిన్నపాటి స్పర్థలను, అనైక్యతను అధిష్ఠానం గుర్తించి సరిచేసింది. దీంతో పోటీ ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చింది. శుక్రవారం రాత్రి ఇరుపార్టీల వారు ఓటుకు రూ.2వేల ప్రకారం పంపిణీ చేశారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వైసీపీ ఒక ఏరియాలో ఓటుకు రూ.5వేల ప్రకారం డబ్బు పంపిణీ ప్రారంభించడంతో సమస్య ముదిరి పాకానపడింది. దీంతో ఎస్పీ ఆదేశాలతో ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో డబ్బు పంపిణీ నివారణకు చర్యలు ప్రారంభించారు. అయితే తెల్లవారుజామున ఈ తంతు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో పోలింగ్‌ సమయానికి ఉద్రిక్తత పెరగవచ్చని భావిస్తున్నారు.

ఒంగోలులో చేతులెత్తేసిన వైసీపీ

చీమకుర్తి మినహా మిగిలిన అన్నిచోట్ల పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వైసీపీ వెనుకబడిపోయింది. ఒంగోలు నగరంలో ఎంపిక చేసుకున్న, మరీ ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరని డివిజన్లపైనే ఆపార్టీ దృష్టిపెట్టి కొన్ని డివిజన్లను వదిలేయడం స్పష్టంగా కనిపిస్తోంది. మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ అన్ని అంశాలలోనూ ముందడుగు వేసింది. కనీస ఆర్థిక సహకారాన్ని ఇచ్చేందుకు కూడా వైసీపీ నాయకత్వం వెనుకంజ వేయడంతో ఆదివారం కొన్నిచోట్ల ఏజెంట్లు కూర్చోవడమే కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. అద్దంకిలో వైసీపీ ఇన్‌చార్జి స్థానికుడు కాకపోవడంతో పట్టణంలో తిరిగే పరిస్థితి లేకుండాపోయింది. రెండు, మూడు వార్డులలోనే దీటుగా కనిపిస్తున్న వైసీపీ ఆదివారం పోలింగ్‌లో అక్కడైనా నిలుస్తుందా? అన్న సందేహాలు ఉన్నాయి. గిద్దలూరులో టీడీపీ, బీజేపీ అధిష్ఠానాల జోక్యంతో మొత్తం పరిస్థితి చక్కబడింది. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో దూకుడు ప్రదర్శించారు. కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓటుకు రూ.2వేలు పంపిణీ జరగ్గా వైసీపీ వారు ఓటుకు రూ.వెయ్యి మాత్రమే పంచగలిగారు. కారణాలేమైనా శనివారం మధ్యాహ్నం నుంచి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో సత్తా చూయించగలిగే వైసీపీ నాయకులు పత్తాలేకుండా పోవడం చర్చనీయాంశమైంది. చీరాలలో మూడు పార్టీలు డబ్బులు పంపిణీ చేసినా అన్ని విషయాల్లోను కూటమి ముందంజలో ఉంది .

Updated Date - Nov 01 , 2026 | 02:55 AM