వినాయక లడ్డూ రూ. 30లక్షలు!
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:46 AM
సీఎస్‌పురం మండలం అయ్యలూరి వారిపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూ, కలశానికి బుధవారం వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల వెంకట సుబ్బారెడ్డి లడ్డూను రూ.30,01,116కు దక్కించుకున్నారు.
వేలంలో పాడుకున్న భక్తుడు
కలశాన్ని రూ. 21లక్షలకు దక్కించుకున్న మరొకరు
సీఎస్‌పురం(పామూరు), సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : సీఎస్‌పురం మండలం అయ్యలూరి వారిపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూ, కలశానికి బుధవారం వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల వెంకట సుబ్బారెడ్డి లడ్డూను రూ.30,01,116కు దక్కించుకున్నారు. కలశంను పాలగుళ్ల నారాయణరెడ్డి రూ.21,01,116కు పాడుకున్నారు.