1.77 లక్షల మందికి విద్యార్థి మిత్ర కిట్లు
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:56 AM
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న 1,77,577 మంది విద్యార్థులకు 2026-27 విద్యా సంవ త్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు.
రేపు పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీ
సరఫరాకాని బ్యాగులు, బూట్లు
ఒంగోలు విద్య, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న 1,77,577 మంది విద్యార్థులకు 2026-27 విద్యా సంవ త్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు. వివిధ కారణా లతో ఇప్పటివరకు విద్యామిత్ర కిట్లలోని కొన్ని అరకొరగా సరఫరా కాగా పాఠ్యపుస్తకాలు, డిక్ష నరీలు, బెల్టులు పూర్తిస్థాయిలో వచ్చాయి. బ్యాగులు, బూట్లు ఇంతవరకూ రాలేదు. దీం తో పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, డిక్షనరీ లు మాత్రం పాఠశాలలు పునఃప్రారంభమ య్యే శుక్రవారం విద్యార్థులకు అందజేయను న్నారు. ఉమ్మడి జిల్లాలోని 38 మండలాల్లో 1,77,577 మందికి యూనిఫాం అవసరం కాగా ఇప్పటి వరకు 1,02,731మందికి మాత్రమే పాఠశాలలకు సరఫరా చేశారు. నోటుపుస్తకాలు 9,38,200 అవసరం కాగా 4,50,006 మాత్రమే సరఫరా అయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు 15,951 అవసరం కాగా నూరుశాతం పాఠశాలలకు చేరాయి. పాఠ్య పుస్తకాలు 11,19,121 అవసరం కాగా 11,08,923 సరఫరా అయ్యాయి. స్కూళ్లకు 10,45,560 చేరాయి.వర్కు పుస్తకాలు 2,45,450 అవసరం కాగా 2,42,975 సరఫరా అయ్యాయి. వాటిలో 2,35,689 స్కూళ్లకు చేరాయి. బెల్టులు 1,25,679 అవసరం కాగా నూరుశాతం జిల్లాకు రాగా అన్ని పాఠశాలలకు తరలిం చారు. బ్యాగులు, బూట్లు ఇప్పటివరకూ ఒక్కటి కూడా సరఫరా కాలేదు.