వెలిగొండ నిర్వాసితుల రాస్తారోకో
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:28 AM
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో 18 సంవత్సరాల వయసు నిండిన నిర్వాసితులం దరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని కోర్టు సెంటర్‌లో రాస్తారోకో చేశారు. దీంతో ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్
మార్కాపురం రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో 18 సంవత్సరాల వయసు నిండిన నిర్వాసితులం దరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని కోర్టు సెంటర్‌లో రాస్తారోకో చేశారు. దీంతో ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డీఎస్పీ నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ, రూరల్ ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.