వాహనాల ఫిట్‌నెస్ ప్రైవేటు పరం
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:01 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనాల ఫిట్‌నెస్ గురువారం నుంచి ప్రైవేటుపరం కానుంది. ఈ మేరకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 నుంచి కేపీ ఎంటర్‌ప్రైజెస్ ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్‌లో వాహనాల ఫిట్‌నెస్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక నుంచి అన్నంగికి ఉమ్మడి జిల్లా వాహనాలు
9వతేదీ నుంచి స్లాట్ బుకింగ్‌లు
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనాల ఫిట్‌నెస్ గురువారం నుంచి ప్రైవేటుపరం కానుంది. ఈ మేరకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 నుంచి కేపీ ఎంటర్‌ప్రైజెస్ ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్‌లో వాహనాల ఫిట్‌నెస్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒంగోలు, దర్శి, మార్కాపురం, కందుకూరు రవాణా శాఖ కార్యాలయాల్లో ఇక వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్‌లు జరగవు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని వాహనదారులు మద్దిపాడు మండలం అన్నంగిలోని కేపీ ఎంటర్‌ప్రైజెస్ ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్‌లో చేయించుకోవాల్సి ఉంటుంది. ఈనెల 8కి స్లాట్‌లు బుక్ చేసుకున్న వారు రద్దుచేసుకొని 9 నుంచి చేసుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్.సుశీల ఒక ప్రకటనలో తెలిపారు.