Share News

చెట్టును ఢీకొట్టిన వాహనం.. డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:36 PM

కుంచేపల్లి గ్రామ సమీపంలో టమా టా లోడుతో వెళుతున్న లగేజి ఆటో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టిది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో డ్రైవర్‌ మృతి చెందారు.

చెట్టును ఢీకొట్టిన వాహనం.. డ్రైవర్‌ మృతి
ప్రమాదానికి గురైన వాహనం

పొదిలి, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : కుంచేపల్లి గ్రామ సమీపంలో టమా టా లోడుతో వెళుతున్న లగేజి ఆటో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టిది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో డ్రైవర్‌ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నుంచి టమాటా లోడుతో వాహనం విజయవాడ వెళ్తుంది. ఈక్రమంలో పొదిలి నుంచి దర్శి వెళ్లే ప్రధాన రహదారి కుంచేపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో డ్రైవర్‌ షేక్‌ హర్షద్‌వలి (29) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 11:36 PM