Share News

వాయు‘గండం

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:34 AM

బంగాళాఖాతం లో వాయుగుండం ఏర్పడటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ సూచించడంతో పంటలను కాపాడు కొనేందుకు పొలాలకు పరుగులు పెడుతున్నారు.

వాయు‘గండం
కొమ్మినేనివారిపాలెంలో వరి పనలను కుప్పలుగా వేస్తున్న కూలీలు

పంటలను కాపాడుకునేందుకు రైతుల ప్రయత్నాలు

వరి నూర్పిళ్లు వేగవంతం

బల్లికురవ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతం లో వాయుగుండం ఏర్పడటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ సూచించడంతో పంటలను కాపాడు కొనేందుకు పొలాలకు పరుగులు పెడుతున్నారు. మండ లంలోని అంబడిపూడి, వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, వైదన, కొప్పెరపాడు, గుడిపాడు, కూకట్లపల్లి, గుంటుపల్లి, వెలమవారిపాలెం తదితర గ్రామాలలో సాగర్‌ కాలువలు, బోర్ల నీటి ద్వారా రైతులు వరి పెద్దఎత్తున వరి సాగు చేశారు. పంట కోతకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వాయుగుండం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమవడంతోపాటు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నూర్పిళ్లను వేగవంతం చేశారు. కొందరు రైతులు వరి కోత మిషన్లను తీసుకువచ్చి నూర్పిడి చేసి ధాన్నాన్ని ఇళ్లకు చేర్చి పట్టలు కప్పి ఉంచుతున్నారు. మరికొందరు పొలంలోనే కుప్పలు వేసే పనిలో ఉన్నారు. గృహాలలో ఉన్న ధాన్యాన్ని రైతులు రెండు రోజులనుంచి పెద్ద ఎత్తున ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 01:34 AM