వైభవంగా వాసవీమాత విగ్రహ పునఃప్రతిష్ఠామహోత్సవం
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:21 PM
కనిగిరి పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు.
మంత్రి టీజీ భరత్, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ప్రత్యేక పూజలు
కనిగిరి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం పండుగ శోభతో కళకళలాడింది. పట్టణం మొత్తం ఆఽధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), మాజీ ఎమ్మెల్యే రాంబాబులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. వేద పండితుల మధ్య శాస్త్రోత్తంగా పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణపతిపూజ, పీఠపూజలు, యంత్రప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ వంటి ముఖ్య క్రతువులు నిర్వహించారు. అనంతరం బలిహరణ, గోపూజ, బిందుపూజ, జపయఙ్ఞాలు, శిఖర కళశ కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన బృందావనం కార్యక్రమాలు, కాంతార అమ్మవారి వేషధారణ, మహిళల రామాయణ యాత్ర వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రామధుసూదన్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, సుభిక్షం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వాసవీసత్ర సముదాయాల చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య కమిటీ కార్యదర్శి, వీవీఆర్ మనోహరరావు (చిరంజీవి), కొలిపర్తి మారుతీకుమార్‌గుప్తా, అద్దంకి రంగబాబు, కొప్పరపు సత్యాలు, దేవకి సుబ్రమణ్యం, దేవికి శ్రీనివాసులు, కోట సురేష్, బొఠ్గిరపు సుందరరాజా పాల్గొన్నారు.