Share News

శాస్త్రోక్తంగా వరుణ జపాలు, హోమాలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:56 PM

వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం వరుణ జపం, యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా వరుణ జపాలు, హోమాలు
చెన్నకేశవ స్వామి ఆలయంలో వరుణ జపం చేస్తున్న వేద పండితులు

మార్కాపురం వన్‌టౌన్‌ అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం వరుణ జపం, యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాలలో వరుణ జపం నిర్వహించారు. మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో వరుణ జపం, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై పూజలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు యక్కలి కాశీవిశ్వనాథం, ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు పీవీ కృష్ణారావు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సమృద్ధిగా వర్షాలు కురవాలి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌ : పట్టణంలోని పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయం నందు మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వరుణదేవుని యాగం నిర్వహించారు. వేదపండితులు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేత యాగం నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు సరిగా లేవని, రాష్ట్రంలోని 175 దేశదాయ, ధర్మాదాయ ఆలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో వరుణ దేవుని యాగం నిర్వహించారు. అందులో భాగంగా పట్టణంలోని పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయం నందు వరుణయాగంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సంవృద్ధిగా వర్షాలు కురవాలని ఆ భగవంతుని ప్రార్థించారు. రాష్ట్రంలో వర్షాలు సక్రమంగా పడి సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గంలో కూడా వర్షాలు పూర్తిస్థాయిలో పడి సస్యశ్యామలంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ఈవో చిక్కుడు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వరుణ యాగంలో పాల్గొన్న ఎరిక్షన్‌బాబు

త్రిపురాంతం : వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వరుణ యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంతోషం కోసం సీఎం చంద్రబాబు, దేవదాయ శాఖ ఆదేశాలతో పుణ్య క్షేత్రాల్లో ఈ వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డీ అనిల్‌ కుమార్‌, ఉభయ దేవాలయాల చైర్మన్‌ మోటకట్ల శ్రీనివాస రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మేకల వలరాజు యాదవ్‌, కూటమి నాయకులు, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో వరుణయాగం

సీఎ్‌సపురం (పామూరు) : మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి, భైరవకోనలోని త్రిముఖ దుర్గాంబ దేవస్థానాల్లో వరుణ యాగ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌లు ముప్పాళ్ల శ్యాంసుందర్‌రాజు, కొమ్మినేని చినఆదినారాయణ, ఈవోలు శ్రీ గిరిరాజు నరసింహబాబు, డీ వంశీకృష్ణారెడ్డితో పాటు టీడీపీ నాయకులు వెంగయ్య, ఎస్‌సీ మాలకొండయ్య, చావా సుబ్బయ్య, కోనంకి వెంకట కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:56 PM