Share News

స్వర్ణ గేటు రోడ్డులో వజ్రపహార్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:02 AM

గంజాయి రహిత చీరాలగా మార్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సుబ్బారావు చెప్పారు.

స్వర్ణ గేటు రోడ్డులో వజ్రపహార్‌

గంజాయి రహిత చీరాలకు కృషి

స్వర్ణగేటు(చీరాల), మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : గంజాయి రహిత చీరాలగా మార్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సుబ్బారావు చెప్పారు. ఎస్సైలు రాజ్యలక్ష్మీ, వెంకటేశ్వరరెడ్డి, సిబ్బందితో కలిసి ఆపరేషన్‌ వజ్రపహార్‌లో భాగంగా స్వర్ణ గేటు రోడ్డులో బుధవారం రాత్రి కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ముమమ్మర తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత నేర పూరిత సంఘటనలు ఉంటే 112కు కాల్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - Mar 12 , 2026 | 12:02 AM