Share News

రూ.158 కోట్లతో పట్టణాల్లో మౌలిక వసతులు

ABN , Publish Date - Sep 23 , 2026 | 02:41 AM

జిల్లాలోని వివిధ మునిసిపల్‌ పట్టణాల్లో మౌలిక వసతుల మెరుగు కోసం రూ.158కోట్లతో చేపడుతున్న పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్‌ ఎన్సు టిమోడ్‌ (హెచ్‌ఏఎం) విధానంలో రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 123 మునిసిపల్‌ పట్టణాలలో సుమారు రూ.11,360 కోట్లతో ఈ పనులు చేపడుతు న్నారు.

రూ.158 కోట్లతో పట్టణాల్లో మౌలిక వసతులు
ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రం నుంచి సీఎం ప్రసంగాన్ని వింటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

వర్చువల్‌గా శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి

రోడ్లు, పార్కులు, డివైడర్లు, వీధి దీపాలు,

మురుగు కాలువల పనులకు ప్రాధాన్యం

మునిసిపాలిటీల పరిధిలో హాజరైన కీలక నేతలు

ఒంగోలు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ మునిసిపల్‌ పట్టణాల్లో మౌలిక వసతుల మెరుగు కోసం రూ.158కోట్లతో చేపడుతున్న పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్‌ ఎన్సు టిమోడ్‌ (హెచ్‌ఏఎం) విధానంలో రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 123 మునిసిపల్‌ పట్టణాలలో సుమారు రూ.11,360 కోట్లతో ఈ పనులు చేపడుతు న్నారు. వాటికి అమరావతి నుంచి వర్చువల్‌ విధానంలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. అందులో జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు నాలుగు మునిసిపాలిటీలకు కలిపి సుమారు రూ.158 కోట్లు కేటాయించారు. ఒంగోలు కార్పొరేషన్‌కు రూ.73కోట్లు, అద్దంకి మునిసిపాలిటీకి రూ.30కోట్లు, కందుకూరుకు రూ.30కోట్లు, దర్శికి రూ.12 కోట్లు, చీమకుర్తికి రూ.13కోట్లు ఇచ్చారు. ఈ నిధుల ద్వారా రోడ్లు, డ్రెయిన్‌లు, పార్కుల అభివృద్ధి, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేపడతారు. కాగా వర్చువల్‌ విధానంలో సీఎం ఈ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని జిల్లాలోని ఆయా పట్టణాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్ల ద్వారా ప్రారంభించగా స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్‌కు సంబంధించిన కార్యక్రమం స్థానిక ఎన్‌టీఆర్‌ కళాక్షేత్రంలో నిర్వహించగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఇతర నేతలు హాజరయ్యారు. కందుకూరు మునిసిపాలిటీలో అక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, దర్శిలో జరిగిన కార్యక్రమంలో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు పాల్గొన్నారు. ఇతరచోట్ల స్థానిక నాయకులు, అధికారులు హాజరయ్యారు.

Updated Date - Sep 23 , 2026 | 02:41 AM