Share News

టీడీపీ హయాంలోనే పేదల అభ్యున్నతి

ABN , Publish Date - Sep 23 , 2026 | 02:46 AM

రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల క్రితం ఏర్పడిన టీడీపీ.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిందని రాష్ట్ర వ్యవ సాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని పెదకండ్లగుంట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను మంగళవారం ఆయన మంత్రి స్వామి, రాజమండ్రి రూరల్‌ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి ప్రారంభించారు.

టీడీపీ హయాంలోనే పేదల అభ్యున్నతి
పెదకండ్లగుంటలో ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు అచ్చెన్నాయుడు, స్వామి, ఎమ్మెల్యేలు, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య, ఇతర ప్రజాప్రతినిధులు

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

పెదకండ్లగుంటలో ఎన్టీఆర్‌, దామచర్ల విగ్రహాల ఆవిష్కరణ

రాజకీయ ముసుగు వేసుకున్న క్రిమినల్‌ జగన్‌ అని ధ్వజం

కొండపి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల క్రితం ఏర్పడిన టీడీపీ.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిందని రాష్ట్ర వ్యవ సాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని పెదకండ్లగుంట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను మంగళవారం ఆయన మంత్రి స్వామి, రాజమండ్రి రూరల్‌ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బస్టాండ్‌ సెంటర్‌లో మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య అధ్యక్షతన జరిగిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎన్టీఆర్‌ ‘సమాజమే దేవాలయం - పేదలే దేవుళ్లు’ అన్న నినాదంతో టీడీపీని స్థాపించారన్నారు. నేటి యువత టీడీపీ పుట్టుపూర్వోత్తరాలను తెలు సుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. రాజకీయ ముసుగు వేసుకున్న క్రిమినల్‌ ఆపార్టీ అధ్యక్షుడని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. జగన్‌కు.. లోకేష్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జగన్‌ ఏమి చదివాడు.. టెన్తా, ఇంటరా? సర్టిఫికెట్లు చూపించాలని అన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల పేపర్లు కార్పెంటర్లు, ఎలక్ట్రీషి యన్లు, కూలీలతో దిద్దించి అనర్హులకు ఉద్యోగా లిచ్చిన మోసగాడు జగన్‌ అని ధ్వజమెత్తారు. తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన నేరస్థుడు జగన్‌ అని అచ్చెన్న దుయ్యబట్టారు. జగన్‌ దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడన్నారు. డీఎస్సీపై అసత్య ప్రచారం చేస్తున్నాడని అచ్చెన్న అన్నారు. జగన్‌ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళితే చంద్రబాబు వచ్చాక సంక్షేమాన్ని మరింత పెంచి, రోడ్లు, ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు. నాయకులుగా మేము కూడా పొరపాటు చేశామన్నారు. 2019లో ఏమరపాటుగా ఉంటే అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. మరో ముఖ్య అతిథి, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, నీతివంతమైన పాలన టీడీపీ చేస్తున్నదన్నారు. చంద్రబాబు ఆవిధంగానే పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. అదేబాటలో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ నారా లోకేష్‌ ప్రజలు, యువత కోసం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సభలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, కొండపి ఏఎంసీ చైర్మన్‌ కర్ణా తిరుపతమ్మ, టీడీపీ మండలాల అధ్యక్షులు కొర్రపాటి వసంతరాయుడు, పోకూరి రవీంద్రబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకండ్లగుంట మాజీ సర్పంచ్‌ తానికొండ వెంకటేశ్వర్లు, పార్టీ గ్రామ అధ్యక్షుడు పున్నయ్య, గ్రామ నాయకులు కల్లూరి మల్లికార్జున, బొల్లా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలకు పెదకండ్లగుంట గ్రామస్థులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.

47 గ్రూపులకు రూ.3.50 కోట్ల చెక్కులు అందజేత

మండలంలోని పెదకండ్లగుంట, జాళ్లపాలెం, వెన్నూరు, చినవెంకన్నపాలెం, పెట్లూరు, తాటాకులపాలెం గ్రామాలకు చెందిన 47 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు వివిధ రుణాల కింద రూ.3.50కోట్లు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను మంగళవారం పెదకండ్లగుంటలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, స్వామి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య అందజేశారు.

తూర్పునాయుడుపాలెంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

తూర్పునాయుడుపాలెం (కొండపి), సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించిన పార్కు, రూ.3.35కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడు కాలువలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఒంగోలు, కందుకూరు, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, ఇంటూరి నాగేశ్వరరావు, ముత్తుమల అశోక్‌రెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు అడకా స్వాములు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Sep 23 , 2026 | 02:46 AM