Share News

6న కనిగిరికి కేంద్ర మంత్రి రాక

ABN , Publish Date - May 27 , 2026 | 03:12 AM

కనిగిరి పట్టణంలోని ఒంగోలు బ స్టాండు సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహావి ష్కరణ జూన్‌ 6వ తేదీన జరగనుంది. కేంద్ర ఫుడ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ హాజరుకానున్నారు.

6న కనిగిరికి కేంద్ర మంత్రి రాక
కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌కు పూలమొక్క ఇచ్చి ఆహ్వానిస్తున్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరాగ్‌ పాశ్వాన్‌

ఢిల్లీ వెళ్లి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మే 26 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి పట్టణంలోని ఒంగోలు బ స్టాండు సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహావి ష్కరణ జూన్‌ 6వ తేదీన జరగనుంది. కేంద్ర ఫుడ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ హాజరుకానున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి కృషితో ప్రముఖులు, ప్రజలు, వివిధ సంఘాల భాగస్వా మ్యంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధునాతన నమూనాతో పనులు చేయించారు. వచ్చేనెల రాష్ట్రంలోని విశాఖలో జరిగే జాతీయస్థాయి కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి చిరాగ్‌పాశ్వాన్‌ రానున్నారు. ఆ తర్వాత అమరావతి ప్రాంతంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈనేప థ్యంలో రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ను మంగళ వారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర కలిశారు. కనిగిరిలో అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు కేంద్ర మంత్రి కనిగిరి పర్యటనకు సుముఖత వ్యక్తం చేశారు. ఆవిష్కరణకు సిద్ధం చేసిన అంబేడ్కర్‌ విగ్రహ నమూనాను పరిశీలించి సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను అభినందించినట్లు తెలిసింది.

Updated Date - May 27 , 2026 | 03:12 AM