Share News

మార్పులేని మార్కెట్‌

ABN , Publish Date - May 14 , 2026 | 03:13 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. భారీగా బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. బుధ వారం మార్కెట్లో కూడా వ్యాపారులు కొనుగోలు చేసిన వాటి కన్నా తిరస్కరిం చినవే అధికంగా ఉన్నాయి.

మార్పులేని మార్కెట్‌

54.24శాతం పొగాకు బేళ్లు వెనక్కి

ఒంగోలు-1 కేంద్రంలో 70శాతం కందుకూరు-1లో 64.28శాతం తిరస్కరణలు

రైతులు వేలానికి తీసుకురావడం తగ్గించినా కొనని వ్యాపారులు

ఒంగోలు, మే 13 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. భారీగా బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. బుధ వారం మార్కెట్లో కూడా వ్యాపారులు కొనుగోలు చేసిన వాటి కన్నా తిరస్కరిం చినవే అధికంగా ఉన్నాయి. ముమ్మరంగా కొనుగోళ్లు జరుగుతూ నిత్యం ఒక్కో కేంద్రానికి ఏడెనిమిది వందల బేళ్లను అమ్మకానికి తీసుకు రావాల్సిన సమ యంలో కొనుగోళ్లు సరిలేక బోర్డు అధికా రులు ముందుజాగ్రత్తగా అతి తక్కువగానే అనుమతిస్తున్నారు. వాటిని కూడా బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంతో తిరస్కరణలు భారీగా ఉంటున్నాయి. దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో బుధవారం వేలానికి కేవలం 2,521 బేళ్లు మాత్రమే వచ్చాయి. వాటిని కూడా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపలేదు. దీంతో 1,355 (54.24) బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో బోర్డు అధికారులు సూచించిన ధరకు బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రాక 1,201 (47.84శాతం) నోబిడ్‌ అయ్యాయి. అత్యధికంగా ఒంగోలు-1లో ఏకంగా 70శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆ కేంద్రానికి రైతులు 282 బేళ్లను తీసుకురాగా వ్యాపారులు 85ను మాత్రమే కొనుగోలు చేశారు. కందుకూరు-1కి 154 బేళ్లను తీసుకురాగా 55ను మాత్రమే కొన్నారు. 64.28శాతం తిరస్కరణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితే పలు ఇతర కేంద్రాల్లోనూ నెలకొంది.

Updated Date - May 14 , 2026 | 03:13 AM