త్రిపురాంతకంలో ఉగాది ఉత్సవాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:18 AM
ప్రసిద్ధ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారం భమవుతున్నాయి. ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహనాధికారి అనిల్‌కుమార్ తెలిపారు.
నేటి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం
28 వరకూ వివిధ సేవలు
అక్షరాభ్యాసానికి ఏర్పాట్లు
మార్కాపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారం భమవుతున్నాయి. ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహనాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. ఉగాది రోజు పల్లకి సేవతో ప్రారంభమై వరుసగా హంస వాహనం, వ్యాఘ్ర, శేష, మయూర, సింహ, గజ, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిం చనున్నారు. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 28న వసంతోత్సవం ఉంటుందని ఈవో తెలిపారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం అక్షరాభ్యాసం జరగనుంది. అందుకు త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారి ఆలయంతోపాటు మార్కాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవ దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాంగ శ్రవణంతోపాటు చిన్నారులకు పలక, బలపం ఇచ్చి వేదపండితులతో అక్షరాభ్యాసం చేయించనున్నారు.