Share News

జిల్లావాసులకు ఉగాది పురస్కారాలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:42 AM

రాష్ట్రప్రభుత్వ టూరిజం, కల్చరల్‌ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే ఉగాది పురస్కారాలకు జిల్లాకు చెందిన పలువురు ఎంపికయ్యారు. కళారత్న(హంస) పురస్కారానికి సాహిత్య విభాగంలో ఒంగోలుకు చెందిన నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ ఎంపికయ్యారు.

జిల్లావాసులకు ఉగాది పురస్కారాలు

ప్రకటించిన ప్రభుత్వం

ఒంగోలు కల్చరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ టూరిజం, కల్చరల్‌ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే ఉగాది పురస్కారాలకు జిల్లాకు చెందిన పలువురు ఎంపికయ్యారు. కళారత్న(హంస) పురస్కారానికి సాహిత్య విభాగంలో ఒంగోలుకు చెందిన నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ ఎంపికయ్యారు. నాటక విభాగంలో తుర్లపాటి రాధాకృష్ణమూర్తికి దక్కింది. సాహిత్య విభాగంలో డాక్టర్‌ జి.వి.రత్నాకర్‌ ఎంపిక కాగా, నళినీప్రియ కూచిపూడి నృత్యనికేతన్‌ నిర్వాహకురాలు ఎస్‌.వి.శివకుమారి నృత్య విభాగంలో పురస్కారం అందుకోనున్నారు. సామాజిక సేవ విభాగంలో జె.వి.మోహ న్‌రావు, ద్రవిడ దేశం వ్యవస్థాపకులు వి.కృష్ణారావు ఎంపికయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Mar 18 , 2026 | 02:42 AM