Share News

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:27 PM

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి మల్లవరం దగ్గర చోటుచేసుకుంది.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

పొదిలి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి మల్లవరం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లవరం గ్రామానికి చెందిన శేఖర్‌, మేరీకి ఇద్దరు కుమారులు వారిలో పెద్దకుమారుడు కార్తీక్‌(20) పనుల నిమిత్తం పొదిలి వస్తున్నాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పేరం చెంచిరెడ్డి తన కుమార్తె వివాహం ఈనెల 16న జరగనుంది. ఈక్రమంలో మల్లవరంలోని బంధువులకు పెళ్లికార్డు ఇచ్చేందకు వచ్చారు. కార్డు ఇచ్చిన చెంచిరెడ్డి తిరిగి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. కార్తీక్‌ల బైక్‌ ఎదురెదురు ఢీకొన్నాయి. దీంతో తీవ్రగాయాలైన చెంచిరెడ్డి, కార్తీక్‌లను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు బంధువులు తెలిపారు.


ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా.. డ్రైవర్‌ మృతి

లింగసముద్రం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి) : ట్రాక్టరు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన లింగసముద్రం మండలం పెంట్రాల పంచాయతీ పరిధిలోని చీమలపెంట గ్రామ సమీపంలోని రోడ్డు మలుపు వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లింగసముద్రం ఎస్టీకాలనీకి చెందిన పాలరాజు(38) మృతి చెందాడు. ఎస్‌ఐ రాంబాబు వివరాల ప్రకారం... పాలరాజు ట్రాక్టరు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మట్టి పనుల నిమిత్తం వెళుతున్న క్రమంలో చీమలపెంట గ్రామ సమీపంలోని రోడ్డు మలుపు వద్ద ట్రాక్టరు అదుపు తప్పి బోల్తా కొట్టింది, దీంతో పాలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరులోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 11:27 PM