Share News

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , Publish Date - Aug 17 , 2026 | 10:53 PM

పామూరు, మండలంలో మూడు చోట్ల ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

పామూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మూడు చోట్ల ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెలిగండ్ల మండలం బాపనపల్లికి చెందిన పుల్లారెడ్డి (45) ద్విచక్రవాహనంపై పామూరు మండలంలోని దాదిరెడ్డిపల్లిలో స్నేహితులతో కలిసి వివాహ కార్యక్రమానికి వస్తున్నాడు. ఆయన మండలంలోని కొండారెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పక్కన బైక్‌ ఆపుకొని మాట్లాడుతుండగా పామూరు నుంచి కనిగిరి వైపు వెళుతున్న కారు పుల్లారెడ్డిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పుల్లారెడ్డి రోడ్డు మీద పడి మృతి చెందారు. మృతదేహాన్ని హైవే అంబులెన్స్‌లో పామూరు వైద్యశాలకు తరలించారు.

మండలంలోని అయ్యవారిపల్లె, బోడవాడ గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పామూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ బాలవెంకటయ్య(29) మృతి చెందారు. తన బైక్‌పై బోడవాడవైపు వెళుతుండగా వ్యక్తి అడ్డుగా రావడంతో అదుపు తప్పడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బాల వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందారు.


పొలంలో విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

పామూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తిరగళదిన్నె గ్రామ పొలాల్లో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బొట్ల రాజు(45) జొన్న పొలానికి వెళ్లి విద్యుత్‌ మోటార్‌ను ఆన్‌చేసి ఇంటికి వచ్చాడు. మధ్యాన్నం 12 గంటల సమయంలో మోటార్‌ ఆఫ్‌ చేసి వస్తానని చెప్పి మళ్లీ పొలానికి వెళ్లాడు. 3 గంటల వరకు ఇంటికి రాక పోవడంతో భార్య మంజుల గేదెలను పొలానికి తీసుకెళ్లింది. అక్కడ మోటార్‌ సమీపంలో భర్త రాజు నేలపై పడి ఉండటాన్ని గమనించిన ఆమె... భర్తను పిలిచినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. సమీప పొలాల్లో ఉన్న వ్యక్తులు అక్కడికి వచ్చి మృతున్ని మోటార్‌ స్టార్టర్‌కు దూరంగా జరిపి పరిశీలించగా విద్యుత్‌షాక్‌తో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై భార్య స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 17 , 2026 | 10:53 PM