ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్టు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:05 PM
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద 2 కిలోల 350 గ్రాముల సరుకును స్వాధీనం చేసుకున్నారు.
2 కిలోల 350 గ్రాముల గంజాయి స్వాధీనం
కందుకూరు, జూన్ 23(ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద 2 కిలోల 350 గ్రాముల సరుకును స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సీఐ అన్వర్‌బాషా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాటల్లోనే... కందుకూరు పట్టణం బండపాలేనికి చెందిన కత్తుల కిషోర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 1 కిలో 100 గ్రాములు, గుడ్లూరు ఎస్టీ కాలనీకి చెందిన కామంచి రాజేష్ అలియాస్ రాజును అరెస్టుచేసి అతని వద్ద 1 కిలో 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగులూరి తిరుపతయ్య నుంచి కిషోర్ గంజాయిని కొనుగోలు చేసి తాను వినియోగిస్తుండటమే గాక చిన్న చిన్న ప్యాకెట్లు చేసి కందుకూరు ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. గుడ్లూరుకు చెందిన కామంచి రాజేష్ ఒడిశా సరిహద్దు ప్రాంతం, విశాఖపట్నం, రాయగడ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్రకాశం జిల్లాకు రవాణా చేసి విక్రయిస్తున్నాడని తెలిపారు. రాజే్‌షను పలుకూరు అడ్డరోడ్డు వద్ద అరెస్టుచేసి విచారించగా నేరం అంగీకరించాడు. సమావేశంలో రూరల్ ఎస్సై బాలకృష్ణ పాల్గొన్నారు.