Share News

రెండెకరాలు.. 66 ఏళ్లు

ABN , Publish Date - May 19 , 2026 | 03:08 AM

ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని 66 ఏళ్లపాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు.

రెండెకరాలు.. 66 ఏళ్లు
ఒంగోలులోని భాగ్యనగర్‌ వద్ద టీడీపీ కార్యాలయానికి కేటాయించిన భూమి

లీజు ప్రాతిపదికన టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని 66 ఏళ్లపాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఒంగోలులోని కొత్తమామిడిపాలెం గ్రామ సర్వే నెంబరులోని 82/1బీ, 2బీలో రెండు ఎకరాల భూమిని టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఆ సమావేశంలో 33 ఏళ్లకు లీజుగా ప్రతిపాదించగా దానిని 66 ఏళ్లకు పెంచి ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి లీజు చెల్లించే విధంగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. టీడీపీ కార్యాలయానికి కేటాయించిన భూమిలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

Updated Date - May 19 , 2026 | 03:08 AM