బల్లిపల్లి వద్దే ట్రిపుల్ ఐటీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:25 AM
కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించింది. తరగ తులు, ట్యుటోరియల్స్ గదుల నిర్మాణానికి మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తరగతులు ప్రస్తుతం ఒంగోలులోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
రూ.18.98 కోట్లతో టెండర్ల ఆహ్వానం
కనిగిరి ప్రాంత వాసుల హర్షాతిరేకాలు
కనిగిరి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించింది. తరగ తులు, ట్యుటోరియల్స్ గదుల నిర్మాణానికి మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తరగతులు ప్రస్తుతం ఒంగోలులోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో బల్లిపల్లిలో శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.25కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. క్లాస్ రూమ్స్, ట్యుటోరియల్ రూమ్స్‌కు రూ.18.98 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. పనుల పూర్తికి ఏడాది గడువు విధించింది. చాలామంది కనిగిరి ప్రాంత విద్యార్థులు ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ అద్దె భవనాల్లోనే చదువుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి ప్రాంతంలోనే ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపారు. విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి అనతికా లంలోనే కనిగిరిలో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఈ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.