Share News

పారదర్శకంగా కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:04 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీల బదిలీల కౌన్సెలింగ్‌ శుక్ర వారం స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి ప్రక్రియను నిర్వహించారు.

పారదర్శకంగా కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న జేసీ కల్పనాకుమారి, పక్కన డీఈవో రేణుక

కేజీబీవీలలో 208 మంది బదిలీ

ఒంగోలు విద్య, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీల బదిలీల కౌన్సెలింగ్‌ శుక్ర వారం స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి ప్రక్రియను నిర్వహించారు. ఈ ఏడాది మే, జూన్‌లలో చేపట్టిన బదిలీల కౌన్సెలింగ్‌ రసాభాస కావడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కేజీబీవీ బదిలీలను 2022లో జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో తదనుగుణంగా ఈ ప్రక్రియను కొనసాగిం చారు. గత కౌన్సెలింగ్‌ రచ్చకెక్కడంతో ఈసారి కలెక్టర్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టిపెట్టి కౌన్సెలింగ్‌ నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ప్రతినిధిగా జేసీతోపాటు డీఈవో, డైట్‌ ప్రిన్సిపాల్‌, సభ్యులు గా ఏపీసీని కన్వీనర్‌గా నియమించారు. డీఈవో రేణుక సీనియారిటీ జాబితాల పరిశీలనకు ముగ్గురు ఎంఈవోలను కేటాయించారు. వారు మెడికల్‌ సర్టిఫికెట్లు, సీనియారిటీని పరిశీలించి ఒక కొలిక్కి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే కౌన్సెలింగ్‌ ఎటువంటి అపోహలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగింది. కేజీబీవీల్లో 199 మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా మరో 9 మంది అదనంగా కలిపి 208మంది బదిలీ అయ్యారు. ప్రిన్సిపాళ్లు 21 మంది, సీఆర్టీ బీఎస్‌ 19 మంది, పీఎస్‌ 17 మంది, ఇంగ్లీషు 27 మంది, హిందీ 31 మంది, గణితం 20 మంది, పీజీటీ 20 మంది, సోషల్‌ 21 మంది, కెమిస్ట్రీ ఇద్దరు, పీఎస్‌ ఒకరు స్థానచలనం పొందారు.

Updated Date - Sep 12 , 2026 | 03:04 AM