Share News

కేజీబీవీల్లో బదిలీలు

ABN , Publish Date - May 07 , 2026 | 02:34 AM

ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్‌ ఆఫీసర్లు, కాంట్రాక్టు రెసిడెన్షి యల్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ల బదిలీలకు ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. ఒకటిన్నర దశాబ్దాలుగా కేజీబీవీల్లో బదిలీలు లేవు.

కేజీబీవీల్లో బదిలీలు
బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరైన కేజీబీవీల ఎస్‌వోలు, టీచర్లు

200 మందికి స్థానచలనం

ఒంగోలు విద్య, మే 6 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్‌ ఆఫీసర్లు, కాంట్రాక్టు రెసిడెన్షి యల్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ల బదిలీలకు ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. ఒకటిన్నర దశాబ్దాలుగా కేజీబీవీల్లో బదిలీలు లేవు. దూర ప్రాంతాల్లో పని చేస్తున్న సీఆర్టీలు, ఎస్‌వోలు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. వీరి మొర ఆలకించిన ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే బలవంతపు బదిలీ లకు తావులేకుండా అభ్యర్థన మేరకు చేపట్టారు. బుధవారం స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఏపీసీ అనిల్‌కుమార్‌ బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గతంలో కోర్టు కేసుల స్థానాలు మినహాయించి కేవలం ఖాళీగా ఉన్నవాటికి మాత్రమే కౌన్సెలింగ్‌ చేపట్టారు ఒకేస్థానంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వాటిని ఖాళీగా చూపించారు. ఈ నిబంధన వల్ల 197 సీఆర్టీ, ఎస్‌వో ఖాళీలు వచ్చాయి. బదిలీకి సీఆర్టీలు 201 మంది, పీజీటీలు 24, స్పెషల్‌ ఆఫీసర్లు 39 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా బుధవారం కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పీజీటీల్లో ఖాళీలు లేకపోవడంతో వారికి బదిలీలు జరిగే అవకాశం లేదు. సీఆర్టీ, ఎస్‌వో 197 ఖాళీలకు సీఆర్టీలు, ఎస్‌వోలను వారు ముందుగా ఆప్షన్లు తీసుకున్నారు. సీనియార్టీ ప్రకారం వరుసక్రమంలో సీఆర్టీలను పిలిచి వారికి స్థానాలు కేటాయించారు. అయితే బదిలీల కౌన్సెలింగ్‌ ఎవరికి ఏ స్థానం ఎక్కడకు సర్దుబాటు చేస్తుంది జాబితాను సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదించాలి. తదుపరి ఎస్పీడీ ఆమోదంతో వీరికి సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌లో ఏపీసీకి సహాయకులుగా ప్లానింగ్‌ అండ్‌ ఎంఈఎన్‌ కోఆర్డినేటర్‌ బాలరత్నం, ప్రకాశం, బాపట్ల జీసీడీవోలు వ్యవహరించారు.

Updated Date - May 07 , 2026 | 02:34 AM