Share News

బదిలీ అయిన టీచర్లకు ఎట్టకేలకు విముక్తి

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:43 AM

జిల్లాలో గతేడాది మే, జూన్‌లలో నిర్వహించిన బదిలీల్లో స్థానాలు కోరుకుని రిలీవర్‌ రాని కారణంగా ఆయా పాఠశాలల్లోనే పనిచేస్తున్న టీచర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అప్పట్లో పాఠశాలల్లో కనీస సంఖ్యలో కూడా టీచర్లను కొనసాగించకుండా అన్ని స్థానాలను ఖాళీలుగా ప్రకటించారు.

బదిలీ అయిన టీచర్లకు ఎట్టకేలకు విముక్తి

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ల చేరికతో పాతస్థానాల నుంచి రిలీవ్‌

ఒంగోలు విద్య, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గతేడాది మే, జూన్‌లలో నిర్వహించిన బదిలీల్లో స్థానాలు కోరుకుని రిలీవర్‌ రాని కారణంగా ఆయా పాఠశాలల్లోనే పనిచేస్తున్న టీచర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అప్పట్లో పాఠశాలల్లో కనీస సంఖ్యలో కూడా టీచర్లను కొనసాగించకుండా అన్ని స్థానాలను ఖాళీలుగా ప్రకటించారు. దీంతో జిల్లాలోని పశ్చిమప్రాంతం, మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న టీచర్లంతా మెరుగైన స్థానాలు కోరుకున్నారు. కొన్ని స్థానా లకు ఎవ్వరూ ముందుకు రాలేదు. రిలీవర్‌ రాని కారణంగా ఆ స్థానాల్లోనే ఏడాది కాలంగా బదిలీ అయిన టీచర్లనే బలవంతంగా కొనసాగిస్తు న్నారు. ప్రస్తుతం ఖాళీ స్థానాలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడంతో ఆయా టీచర్లను అక్కడి నుంచి పంపేందుకు వీలు కలిగింది. 17మంది టీచర్లు ఎట్టకేలకు పాతస్థానాల నుంచి రిలీవై వారు కోరుకున్న కొత్త స్థానాల్లో చేరి ఊపిరిపీల్చుకున్నారు.

విధుల్లో చేరిన 171 మంది ఏఐలు

జిల్లాలో ప్రస్తుతం 70 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (ఏఐ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు 241 పోస్టులు మంజూరు కాగా 206 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరిలో 171 మంది విధుల్లో చేరారు. వారిలో 74 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 97 మంది స్కూలు అసిస్టెంట్లు ఉన్నారు. మిగిలిన 70 పోస్టుల్లో 30 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 40 మంది స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు మిగిలిపోయాయి.

Updated Date - Sep 09 , 2026 | 01:43 AM