Share News

పోలీసు శాఖలో బదిలీల పర్వం

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:08 AM

పోలీసు శాఖలో బదిలీల పర్వం ప్రారంభమైంది. బుధవారం జిల్లాలో పలువురు సీఐలకు స్థానచలనం కల్పించారు. ప్రస్తుతం సింగరాయకొండలో పనిచేస్తున్న హజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్‌కు బదిలీ చేశారు.

పోలీసు శాఖలో బదిలీల పర్వం

వీఆర్‌కు ఇద్దరు సీఐలు

కొండపి, సింగరాయకొండ సర్కిళ్ల కోసం ముమ్మర ప్రయత్నాలు

కొలిక్కిరాని మార్కాపురం

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : పోలీసు శాఖలో బదిలీల పర్వం ప్రారంభమైంది. బుధవారం జిల్లాలో పలువురు సీఐలకు స్థానచలనం కల్పించారు. ప్రస్తుతం సింగరాయకొండలో పనిచేస్తున్న హజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. ఒంగోలు ట్రాఫిక్‌ సీఐ జగదీష్‌ను వీఆర్‌కు పంపించారు. ఒంగోలు వన్‌టౌన్‌ సీఐగా పనిచేస్తున్న వై.నాగరాజును వీఆర్‌లో ఉంచారు. ప్రస్తుతం ఒంగోలు ఐటీ కోర్‌ టీం సీఐగా పనిచే స్తున్న కేశన వెంకటేశ్వర్లును వన్‌టౌన్‌ సీఐగా బదిలీ చేశారు. కొండపి సీఐగా పనిచేస్తున్న సోమశేఖర్‌ను చీరాల వన్‌టౌన్‌కు స్థానచలనం కల్పించారు. దీంతో కొండపి, సింగరాయకొండ సీఐ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ రెండు సర్కిళ్లలో ఒక పోస్టు కోసం ప్రస్తుతం సంతమాగులూరు సీఐగా పనిచేస్తున్న రమణయ్య ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి స్వామి... సీఐలు దేవప్రభాకర్‌, రమణయ్యకు సిఫారసు చేశారు. అదేక్రమంలో మార్కాపురం సర్కిల్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంది. అక్కడ పనిచేస్తున్న సుబ్బారావు వీఆర్‌కు వెళ్లారు. దీంతో మార్కాపురం పోస్టు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన మార్కాపురానికి వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరికొంతమంది సీఐలను బదిలీకానున్నారు. కాగా గతంలో ఒంగోలు తాలూకా సీఐగా పనిచేసిన లక్ష్మణ్‌ బాలినేని ద్వారా ఎక్కడో ఒకచోట పోస్టింగ్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు ఐజీకి బాలినేని ఫోన్‌ చేసినట్లు సమాచారం.

Updated Date - Apr 23 , 2026 | 03:08 AM