విషాద యాత్ర
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:56 AM
శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వస్తున్న భక్తుల ఆనంద యాత్ర తిరుగు ప్రయాణంలో విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న కారును కంభం సమీపంలోని జంగంగుంట్ల వద్ద మినీ లారీ ఢీకొనడంతో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కారును ఢీకొన్న మినీ లారీ..
ముగ్గురు దుర్మరణం
ఏడుగురికి తీవ్రగాయాలు
అందరూ కర్ణాటక భక్తులు
శ్రీశైలం వచ్చి వెళ్తుండగా జంగంగుంట్ల వద్ద ప్రమాదం
లారీ డ్రైవర్ నిద్రమత్తు.. రాంగ్‌రూట్ కారణం
దోర్నాల వద్ద రెండురోజుల క్రితం ఘటనలో ఇద్దరు మృతి
మార్కాపురం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వస్తున్న భక్తుల ఆనంద యాత్ర తిరుగు ప్రయాణంలో విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న కారును కంభం సమీపంలోని జంగంగుంట్ల వద్ద మినీ లారీ ఢీకొనడంతో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిద్రమత్తు, రాంగ్‌రూట్ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా చికోడి ప్రాంతానికి చెందిన 13 మంది తుఫాన్ కారులో శ్రీశై లంకు బయల్దేరారు. దారిలో ఉన్న పలు దేవాలయాలను దర్శించుకున్నారు. ఆదివారం శ్రీశైలం చేరుకున్న వారు దైవదర్శనం చేసుకున్నారు. సోమవారం మహానందికి వెళ్లి అక్కడి నుంచి స్వగ్రామానికి చేరుకోవాలన్నది వారి ఆలోచన. కానీ వారి యాత్ర విషాదంగా మారింది. ఎదురుగా అరటికాయల లోడుతో రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ అదుపుతప్పి కర్ణాటక వాసులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది.. కారు రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. లారీ కూడా మరోవైపుకు బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో కారులో ఉన్న గౌరవ్ సాహు (41), ఆనంద్‌రాజ్ సింగ్ (60), అజిత్ సాకూర్ (30) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రవంగా, ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ గాయపడ్డారు. దోర్నాల వద్ద రెండు రోజుల కిందట కర్ణాట నుంచి శ్రీశైలంకు బైక్‌మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అడవి పందిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారు సోమవారం మృతిచెందారు.