పోలినేనిపాలెంలో విషాదం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:50 PM
వలేటివారిపాలెం మండలంలోని పోలినేనిపాలెంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంచినీటి బావిలో పడి తండ్రీకొడుకులు మృతి చెందారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి తండ్రీకొడుకులు మృతి
వలేటివారిపాలెం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పోలినేనిపాలెంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంచినీటి బావిలో పడి తండ్రీకొడుకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే... పోలినేనిపాలేనికి చెందిన పిర్ల పాపారావు ఆయన కుమారుడు శ్రీకాంత్ బుధవారం గొర్రెలను తోలుకొని విప్పగుంట పొలాల్లోకి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీకాంత్ అన్నం తిని మంచినీటి కోసం బావి వద్దకు వెళ్లాడు. మంచినీరు తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. కొడుకు వెంటనే రాలేదని పాపారావు బావివద్దకు వెళ్లాడు. శ్రీకాంత్ బావిలో పడిపోయినట్లు గుర్తించి కాపాడుకునేందుకు పాపారావు బావిలో దూకాడు. శ్రీకాంత్ భయపడి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. పాపారావు ఈత కొట్టే అవకాశం లేక తండ్రీకొడుకులు మృతి చెందారు. గొర్రెలు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చాయి. తండ్రీకొడుకులు రాలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పొలం వెళ్లి వెతకగా బావిలో తండ్రీకొడుకులు మృతి చెంది ఉన్నారు. వెంటనే వారిని బయటకుతీసి ఇంటికి తీసుకొచ్చారు. పాపారావుకు భార్య కుమార్తె ఉన్నారు.