నేడుఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:44 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరులో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. సౌజన్యంతో ఆదివారం నిర్వహించనున్నారు.
కనిగిరి, గిద్దలూరులలో ఏర్పాట్లు పూర్తి
కనిగిరి/గిద్దలూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరులో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. సౌజన్యంతో ఆదివారం నిర్వహించనున్నారు. అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కనిగిరిలో అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గుంటూరు), ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారంతో స్థానిక ఆర్టీసీ డిపో ఎదురు ఉన్న కరెంట్ ఆఫీస్ ప్రాంగణంలో పోటీలు నిర్వహిస్తున్నారు. విజేత లకు ప్రథమ బహుమతిగా రూ.15వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.10వేలు, తృతీయ బహుమతిగా రూ.5వేలు నగదును అందిస్తారు. మహిళలు ముగ్గుల కోసం అవసరమైన సామగ్రిని తమ వెంట తెచ్చుకోవా ల్సి ఉంటుంది. గిద్దలూరులోని రిక్రియేషన్ క్లబ్ రోడ్డు లోని టెన్ని్‌సకోర్టు ఆవరణలో లక్ష్మీ మిల్క్ డెయిరీ, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సౌజన్యంతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతిగా ఫ్రిజ్, రెండో విజేతకు వాషింగ్‌మిషన్, మూడో విజేతకు టేబుల్ టాప్ గ్రైండర్‌ను ఇవ్వనున్నారు. 10 మందికి కన్సొలేషన్ బహుమతులు ఉంటాయి. పోటీల్లో పాల్గొనే మహిళలు ఉదయం 9గంటలకు ముందే ప్రాంగణం వద్దకు చేరుకోవాలి. సోమవారం చీరాలలో సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల, మంగళవారం ఒంగోలులో ని క్విస్ కళాశాల ఆవరణలో ఈ పోటీలు ఉంటాయి.