Share News

నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:29 AM

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జరగనుంది. అందుకు జిల్లా అంతటా తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అవిర్భవించి ఈనెల 29 నాటికి 43 ఏళ్లు పూర్తవుతున్నాయి. 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధిష్ఠానం సూచించింది.

నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ఒంగోలులో ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ శ్రేణులు

భారీ ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు

ఒంగోలు, మార్చి 28 (ఆంధ్ర జ్యోతి) : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జరగనుంది. అందుకు జిల్లా అంతటా తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అవిర్భవించి ఈనెల 29 నాటికి 43 ఏళ్లు పూర్తవుతున్నాయి. 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధిష్ఠానం సూచించింది. గ్రామ, మండల, పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో ఎక్కడికక్కడ ఎలా చేయాలన్న దానిపై కూడా కేంద్ర కార్యాలయం నుంచి సూచనలు అందాయి. అన్ని స్థాయిల్లోనూ పార్టీ జెండా ఆవిష్కరణలు, ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు, పార్టీ ప్రతిజ్ఞ, సీనియర్‌ నాయకులకు సన్మానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు పాల్గొనాలని ఆదేశించింది. మరోవైపు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక లోగోను రూపొందించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేష్‌ ఫొటోలు, సైకిల్‌ గుర్తులతో కూడి ఉన్న ఈలోగోను సోషల్‌ మీడియాలో డీపీలుగా విస్తృతంగా వాడాలని ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం సూచించింది. తదనుగుణంగా పార్టీ శ్రేణులు అనేక మంది తమ వాట్సాప్‌లలో డీపీలుగా రెండు రోజుల నుంచి వాడుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం జిల్లా అంతటా ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి.

Updated Date - Mar 29 , 2026 | 02:29 AM