నాణ్యతగా పొగాకు దిగుబడి
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:41 PM
పశ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది నాణ్యమైన పొగాకు దిగుబడి వస్తోంది. మొక్కలు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో పొగాకు దిగుబడి నాణ్యతగా కనబడుతోంది. తోటలు ఏపుగా పెరగకపోయినప్పటికి పొగాకు దిగుబడి నాణ్యతతో వస్తుండడంతో రైతులు సంతోషంలో ఉన్నారు. ఈ ఏడాది భారీగా పెట్టుబడులు కూడా పెరిగాయి.
తర్లుపాడు, జనవరి 8 (ఆంధ్రజోతి): పశ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది నాణ్యమైన పొగాకు దిగుబడి వస్తోంది. మొక్కలు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో పొగాకు దిగుబడి నాణ్యతగా కనబడుతోంది. తోటలు ఏపుగా పెరగకపోయినప్పటికి పొగాకు దిగుబడి నాణ్యతతో వస్తుండడంతో రైతులు సంతోషంలో ఉన్నారు. ఈ ఏడాది భారీగా పెట్టుబడులు కూడా పెరిగాయి. మూట నారు ధర రాజమండ్రి నుంచి 7 రూపాయల చొప్పున కొనుగొలు చేసుకొచ్చి నాటారు. వర్షాలు లేకపోవడంతో కొందరు రైతులు నానా అవస్థలు పడి స్ల్పింక్లర్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా నీటిని పొగాకు తోటలను పెట్టి పెంచుకున్నారు. ఖర్చులు కూడా విపరీతంగా పెరగడంతో ధర పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం మొదటి కొట్టు క్యూరింగ్ అయి ర్యాక్‌లలో ఉన్నది. రెండవ కొట్టు, మూడవ కొట్టు మరింత నాణ్యమైన దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిస్తే రంగు మారే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు దాదాపుగా 50 వేల రూపాయల వరకు ఖర్చు అయినట్లు రైతులు తెలిపారు. గత ఏడాది నష్టాలు చూసిన రైతన్నలు ఈ ఏడాదైనా కొంతమేర అప్పులు తీరుతాయోమోనని పొగాకు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.