Share News

ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే పొగాకు కొనాలి

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:38 AM

ప్రభుత్వం నిర్దేశించిన ధరలతోనే వ్యాపారులు పొగాకు కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికా రులను కలెక్టర్‌ రాజాబాబు ఆదేశిం చారు. అనుమతులు లేకుండా పం డించిన పొగాకును కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేలా చూడాలన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే పొగాకు కొనాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి

అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం నిర్దేశించిన ధరలతోనే వ్యాపారులు పొగాకు కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికా రులను కలెక్టర్‌ రాజాబాబు ఆదేశిం చారు. అనుమతులు లేకుండా పం డించిన పొగాకును కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఒంగోలు లోని ప్రకాశం భవన్‌లో సోమవారం వ్యవసాయ, సంబంధిత అను బంధశాఖల అధికారులు, పొగాకు బోర్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు వేలం కేంద్రాల వద్ద వ్యవ సాయశాఖ అధికారులను ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. పంట కొనుగోలు విషయమై వారితో చర్చించి వారి సూచనలు, సలహాలను రైతులు తీసుకోవాల న్నారు. ఈ ఏడాది బోర్డు అను మతించిన మేరకే పొగాకు సాగు, పంట ఉత్పత్తి అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవిషయమై పొగాకు బోర్డు, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్‌ అధికారులు సంయుక్తంగా దృష్టి సారించాలన్నారు. అనుమ తులు లేకుండా పొగాకు బ్యారన్‌ల నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నారు. తుఫాన్‌ ప్రభావం జిల్లాలో ఉండే అవకాశం ఉన్నందున ఎలాంటి నష్టం వాటిల్లకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్‌, మత్స్యశాఖల అధికారులను ఆదేశించారు. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. సెల్‌ టవర్ల వద్ద విద్యుత్‌ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 02:38 AM