Share News

పొగాకు సమాఖ్య పాలక వర్గం గడువు పొడిగింపు

ABN , Publish Date - Mar 09 , 2026 | 10:59 PM

ఏపీ పొగాకు ఉత్పత్తిదారుల సహకార యూనియన్‌ పాలక వర్గం గడువును ప్రభుత్వం పొడిగించింది.

పొగాకు సమాఖ్య పాలక వర్గం గడువు పొడిగింపు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : ఏపీ పొగాకు ఉత్పత్తిదారుల సహకార యూనియన్‌ పాలక వర్గం గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్‌ అఫిషియో చీఫ్‌ సెక్రటరీ బి. రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొగాకు ఉత్పత్తిదారుల సహకార యూనియన్‌ నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జీ కమిటీ గడువును ఈ ఏడాది ఫిబ్రవరి 13నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.

Updated Date - Mar 09 , 2026 | 10:59 PM