Share News

ముఖ్యమంత్రి సభకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:39 AM

మార్కాపురంలో బుధవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లపై అధికారులతో ఆయన మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు

ముఖ్యమంత్రి సభకు పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు, పక్కన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

సమన్వయంతో పనిచేయండి

ప్రజలకు అన్ని వసతులూ కల్పించాలి

అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

మార్కాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలో బుధవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లపై అధికారులతో ఆయన మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో బహిరంగ సభ ప్రాంగణం వద్ద అవసరమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకుచెప్పారు. వేదిక సమీపంలోనే నిర్మిస్తున్న హెలిప్యాడ్‌ పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమానికి వచ్చే వీఐపీలకు పార్కింగ్‌ సౌకర్యం, భద్రతపై చర్చించారు. నియోజకవర్గాలవారీగా వచ్చే వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ స్థలాలను కేటాయించాలన్నారు. పారిశుధ్యం, మరుగుదొడ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలే పంచాయతీ అధికారులు చూడాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు తాగునీరు సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ శివరామిరెడ్డి, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోస్‌ఫకుమార్‌, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ ద్వారా సీఎం పర్యటనకు భద్రత: ఎస్పీ

ముఖ్యమంత్రి పర్యటనకు అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ ద్వారా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సభ ఏర్పాట్లను ఎస్‌ఎ్‌సజీ అదనపు ఎస్పీ రమణతో కలిసి పరిశీలించి ఈ వివరాలను వెల్లడించారు. హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించి కాన్వాయ్‌ రూట్‌, బందోబస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ఫీడర్‌ కాలువ పనుల ప్రాంతాన్ని పరిశీలించి ఎక్కడా భద్రతా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, ఎర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:39 AM