Share News

వీఆర్‌కు ముగ్గురు ఎస్సైలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:09 AM

జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలను వీఆర్‌కు పంపారు. వారిస్థానం లో కొత్తవారిని నియమించారు. ఈమేరకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

వీఆర్‌కు ముగ్గురు ఎస్సైలు

అందరూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పనిచేస్తున్న వారే!

ఆ స్థానాల్లో కొత్తవారి నియామకం

మార్కాపురం, ఫిబ్రవరి 28 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలను వీఆర్‌కు పంపారు. వారిస్థానం లో కొత్తవారిని నియమించారు. ఈమేరకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య స్థానంలో ఒంగోలు డీసీఆర్బీలో ఉన్న ఎం.దేవకుమార్‌ను, పుల్లలచెరువు ఎస్సై సంపత్‌కుమార్‌ స్థానంలో ఒంగోలు టూటౌన్‌లో పనిచేస్తున్న బి.సాంబశివరావును నియమించారు. త్రిపురాంతకం ఎస్సై శివబసవరాజు స్థానంలో వీఆర్‌లో ఉన్న శివరామయ్యకు అక్కడ పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - Mar 01 , 2026 | 03:09 AM