అవి సాధారణ తనిఖీలే!
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:17 AM
గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో గత మూడు రోజులుగా తాము చేస్తున తనిఖీలు సాధారణ తనిఖీల్లో భాగమేనని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్సీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఎవరినీ టార్గెట్ చేయడం లేదు
విజిలెన్స్ ఏఎస్పీ శ్రీనివాసరావు
గ్రానైట్ క్వారీల్లో మరికొన్ని రోజులు కొనసాగుతాయని ఉద్ఘాటన
చీమకుర్తి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో గత మూడు రోజులుగా తాము చేస్తున తనిఖీలు సాధారణ తనిఖీల్లో భాగమేనని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్సీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశారు. బుధవారం కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సంబంధించిన క్వారీల్లో తనిఖీలు నిర్వహించారు. ఏఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల మేరకు క్వారీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? లేదా? అన్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగుతాయన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. నిబంధనల మేరకు క్వారీలు నిర్వహించుకునే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు.