Share News

పాలిసెట్‌లో మెరిశారు

ABN , Publish Date - May 06 , 2026 | 02:39 AM

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు మెరిశారు. 94.72 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు.

పాలిసెట్‌లో మెరిశారు

94.72శాతం ఉత్తీర్ణత... బాలికలు టాప్‌

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా మూడోస్థానం

ఒంగోలు విద్య మే 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు మెరిశారు. 94.72 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే ఎక్కువ సాధించి ప్రతిభను చాటారు. బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్రంలో సగటున 91.37శాతం మంది ఉత్తీర్ణులు కాగా జిల్లా విద్యార్థులు 3.45శాతం అధికంగా 94.72 శాతం మంది పాసయ్యారు. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 178 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 84వేల సీట్లు అందుబాటులో ఉండగా 1,48,950 మంది విద్యార్థులు డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పొందారు. జిల్లాలో 3,030 మంది పాలి సెట్‌ సరీక్షకు హాజరుకాగా 2,870 మంది (94,72శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత మూడు శాతం అధికంగా ఉంది. బాలురు 1,820 మందికి 1,702 (93.52శాతం) మంది పాసయ్యారు. రాష్ట్రసగటు కంటే ఇది 4శాతం అధికం. బాలికలు 1,210 మందికి 1,168 మంది (96.53) ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సగటు కంటే మూడు శాతం అదనం. పాలిసెట్‌ ఫలితాల్లో షేక్‌ సమిమా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. 119 మార్కులతో రాష్ట్రస్థాయిలో 72వ ర్యాంకు సాధించారు. పి.రామచంద్రారెడ్డి 116 మార్కులతో 256 ర్యాంకు, ఎ.మోహనకృష్ణ 113 మార్కులతో 509 ర్యాంకు సాధించారు. పాలిసెట్‌కు హాజరైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ 100శాతం ఉత్తీర్ణులై పాలిటె క్నిక్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు.

Updated Date - May 06 , 2026 | 02:39 AM