Share News

పప్పు, పచ్చడితోనే సరిపెడుతున్నారు!

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:01 AM

మెనూ అమలు కావడం లేదని, ప్రతిరోజు ప చ్చడి, పప్పుతోనే సరిపెడుతున్నారని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం వి ద్యార్థులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎ దుట వాపోయారు.

 పప్పు, పచ్చడితోనే సరిపెడుతున్నారు!

మెనూ అసలు పట్టించుకోవటం లేదు

ఎమ్మెల్యే ఇంటూరి వద్ద విద్యార్థినుల ఆవేదన

కందుకూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మెనూ అమలు కావడం లేదని, ప్రతిరోజు ప చ్చడి, పప్పుతోనే సరిపెడుతున్నారని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం వి ద్యార్థులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎ దుట వాపోయారు. కందుకూరులోని టీఆర్‌ఆ ర్‌ ప్రభుత్వ కళాశాలల ఆవరణలోని బాలికల వసతిగృహాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆకస్మికం గా తనిఖీచేశారు. ఆ సమయంలో హాస్టల్‌ వా ర్డెన్లు ఇద్దరూ అందుబాటులో లేరు. దీంతో నేరుగా వంటగదిలోకి వెళ్లిన ఎమ్మెల్యే భోజనం కోసం తయారుచేస్తున్న పదార్థాలను పరిశీలిం చారు. ఈ హాస్టల్‌లో టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూ నియర్‌, డిగ్రీ కళాశాలలతో పాటు నర్సింగ్‌ వి ద్యార్థులతో కలిపి 200మందికి పైగా ఉంటు న్నారు. వారికి సరిపడా ఆహారం తయారుచే యటం లేదని గమనించి ఎమ్మెల్యే తీవ్ర ఆ గ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యా ర్థునులు మాట్లాడుతూ మెనూ అమలుచేయ డం లేదన్నారు. ప్రతిరోజు పప్పు, పచ్చడితోనే సరిపెడుతున్నారన్నారు. సాయంత్రం స్నాక్స్‌ ఇ వ్వడం పూర్తిగా మానేశారని ఎమ్మెల్యేకు ఫిర్యా దు చేశారు. తగినన్ని బెడ్‌లు కూడా లేక పోవటంతో నేలపైనే పడుకుంటున్నామని ఆ యన దృష్టికి తెచ్చారు. ఈలోగా వార్డెన్లు ఇ ద్దరు హాస్టల్‌కు చేరుకున్నారు. దీంతో వారిపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పట్టికను రాసి అమలుచేయా లని ఆ పట్టికలో తన ఫోన్‌ నెంబరు కూడా రాయించాలని సూచించారు. విద్యార్థినులు ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్‌ చేసి నేరుగా హా స్టల్‌కు వచ్చి తగు చర్యలు తీసుకుంటానన్నా రు. ఇది మొదటి హెచ్చరికగా తీసుకుంటున్నా మన్నారు. ఆయన వెంట దామా మల్లేశ్వరరా వు, షేక్‌ రఫీ, నల్లూరు సూర్యనారాయణరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 01:01 AM