సర్దుకునిపోతున్నారు...
ABN , Publish Date - Aug 18 , 2026 | 02:24 AM
లిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు ప్రభుత్వం ప్రకటించిన తేదీ దగ్గర పడుతోంది. దీంతో కీలకంగా మారిన ముంపు గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు డు స్వయంగా వచ్చి నిర్వాసితులతో మా ట్లాడటం, సందేహాలను నివృత్తి చేయడం తో చాలావరకు సమస్య పరిష్కారమైంది.
గ్రామాలను ఖాళీ చేస్తున్న వెలిగొండ నిర్వాసితులు
స్వచ్ఛందంగా తరలిపోతున్న వైనం
ట్రయల్ రన్‌కు ముందే జాగ్రత్తలు
మార్కాపురం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు ప్రభుత్వం ప్రకటించిన తేదీ దగ్గర పడుతోంది. దీంతో కీలకంగా మారిన ముంపు గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు డు స్వయంగా వచ్చి నిర్వాసితులతో మా ట్లాడటం, సందేహాలను నివృత్తి చేయడం తో చాలావరకు సమస్య పరిష్కారమైంది. మరో నాలుగు రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహించనుండగా ముందుగానే గ్రామాల నుంచి బయట ప్రాంతాలకు ఒక్కొక్కరుగా సామగ్రిని తరలించుకుంటున్నారు. పరిహారం తమ ఖాతాల్లో పడిన తరువాత గ్రామాల నుంచి బయటకు వస్తామని కొందరు చెబుతుండగా, మంత్రి మాట ప్రకారం పరిహారం అందుతుందనే నమ్మకంతో ముందుగానే నివాస స్థలం చూసుకుంటే మంచిదని కొందరు తరలుతున్నారు. సోమవారం సుంకేసుల, గొట్టిపడియ గ్రామాల నుంచి కొందరు సామాన్లు తీసుకుని మార్కాపురం వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అందులో సుంకేసుల వాసుల్లో కొందరికి ఇప్పటికే పరిహారం అందగా మిగిలిన వారికి కూడా నేడో, రేపో అందే అవకాశం ఉంది. గొట్టిపడియ నుంచి ఒక కుటుంబం ఆటోలో సామగ్రి తరలిస్తుండగా వారిని ప్రశ్నిస్తే మార్కాపురంలో ఇళ్లు అద్దెకు దొరకవనే ఉద్దేశంతో ముందుగానే వస్తున్నామని చెప్పారు. మొత్తంమీద గ్రామాల నుంచి నిర్వాసితులు బయటకు రావడం ప్రారంభమైంది.