Share News

గ్రామాల్లో పారిశుధ్య లోపం లేకుండా చూడాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:35 AM

గ్రామాల్లో పారిశుధ్యలోపం లేకుండా చూడాలని ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్‌ అన్నారు. సోమవారం కొత్తపట్నంలో స్వచ్ఛ సంక్రాంతి - స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమం కింద జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు.

గ్రామాల్లో పారిశుధ్య లోపం లేకుండా చూడాలి
కొత్తపట్నం గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్‌

కొత్తపట్నం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యలోపం లేకుండా చూడాలని ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్‌ అన్నారు. సోమవారం కొత్తపట్నంలో స్వచ్ఛ సంక్రాంతి - స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమం కింద జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన, జరగబోయే కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వి వరించారు. మండలంలో ఇప్పటికే రూ.7.50 కోట్లతో సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. కొద్ది రోజుల్లోనే మరో రూ. 8 కోట్లతో మరి కొన్ని రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. సభలో గ్రామ సర్పంచి శ్రావణి, తెలుగుదేశం మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్డీవో శ్రీ కృష్ట, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం జిల్లా నాయకుడు గేనం సుబ్బారావు, గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామచంద్రగౌడ్‌, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:35 AM