ఉపేక్షించేది లేదు
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:52 AM
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కార్పొరేషన్ స్పెషలాఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. బుధ వారం ‘కార్పొరేషన్ ఖాళీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.
కార్పొరేషన్ పనితీరుపై కలెక్టర్ రాజాబాబు సీరియస్
ఇకపై ప్రత్యేక స్క్వాడ్‌తో పారిశుధ్యం పరిశీలన
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని ఆదేశం
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కార్పొరేషన్ స్పెషలాఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. బుధ వారం ‘కార్పొరేషన్ ఖాళీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, అడ్మినిస్ట్రే షన్ విభాగాల అధికారులతో వేర్వేరుగా సుమా రు రెండున్నర గంటలు సమీక్షలు నిర్వహించారు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాలని ఆదే శించారు. ఇకపై ప్రతిరోజూ పారిశుధ్యంపై స్పెష ల్ ఫోకస్ పెడతామన్నారు. నగర సుందరీకర ణకు అవసరమైతే మరో వంద మంది సిబ్బం దిని తాత్కాలిక పద్ధతిన పనిలోకి తీసుకోవాల న్నారు. క్లీన్ ఒంగోలు ఆవిష్కృతమే లక్ష్యంగా పని చేయాలన్నారు.ప్రజలు సమస్యలను తెలిపేందు కు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక స్క్వాడ్‌తో ప్రతిరోజు శానిటేషన్‌ను పరిశీలిస్తామని వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వీడాలని, చిత్తశుద్ధితో పనిచేసినపుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు. అలాగే తడిచెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శానిటీ సెక్రటరీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇద్దరి నుంచి వచ్చిన హాజరు ప్రామాణికంగా సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు.
మే 1 నుంచి కార్పొరేషన్ 150 సంవత్సరాల వేడుకలు
ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు అయినందున మే 1వ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ఐదు నెలలపాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఆ దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ వేడుకల్లో ప్రజలను భాగస్వాములను చేయడంతోపాటు, నగరాన్ని సుందరంగా ఉంచడంలో వారు భాధ్యతగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ కమిషనర్ రాంభూపాల్‌రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, ఎంఈ ఏసయ్య, శానిటరీ సూపర్ వైజర్‌లు పిచ్చయ్య, బాబ్జి పాల్గొన్నారు.