రామాలయ ధ్వజస్తంభం ఇత్తడి తొడుగుల చోరీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:13 PM
దొనకొండ మండలంలోని లక్ష్మీపురంలోని రామాలయం ధ్వజస్తంభం ఇత్తడి తొడుగులు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దొనకొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీపురంలోని రామాలయం ధ్వజస్తంభం ఇత్తడి తొడుగులు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు... లక్ష్మీపురంలోని రామాలయానికి చెందిన ధ్వజస్తంభం దెబ్బతినటంతో దాదాపు 80 కేజీల ఇత్తడి తొడుగులు తీసి దేవాలయం పక్కన ఉన్న పంచాయతీ కార్యాలయ భవనంలో భద్రపరిచారు. వారం క్రితం వరకు ఇత్తడి తొడుగులు భద్రంగా ఉన్నాయి. గ్రామస్తులు సోమవారం వేరే పని నిమిత్తం పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లి చూడగా కనిపించలేదు. సుమారు రూ.50వేలు విలువచేసే ఇత్తడి తొడుగులను గుర్తుతెలియని దొంగలు దొంగలించారని భావించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.