Share News

మూలగుంటపాడులో చోరీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:22 PM

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని నేతాజీరోడ్డులో తాళం వేసిన ఇంటిలో గుర్తుతెలియని దుండగలు చోరీకి పాల్పడ్డారు.

మూలగుంటపాడులో చోరీ

రూ.10.12లక్షల నగదు అపహరణ

సింగరాయకొండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని నేతాజీరోడ్డులో తాళం వేసిన ఇంటిలో గుర్తుతెలియని దుండగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రధాన ద్వారం తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని రూ.10.12లక్షల నగదును అపహరించారు. మూలగుంటపాడుకి చెందిన తన్నీరు శ్రీను ఈ నెల 13 తేదీన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల చేస్తున్న తన కుమారులు వద్దకు వెళ్లారు. మరలా తిరిగి మంగళవారం ఇంటికి వచ్చారు. రాగానే ఇంటి తలుపు తాళం పగులకొట్టి ఉండటాన్ని చూసి ఆందోళన చెందారు. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని నగదు అపహరణ గురైనట్లు గ్తుతంచి పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ తీరును పరిశీలించారు. క్లూస్‌ టీం బృందాన్ని రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. బాధితుడు తన్నీరు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 24 , 2026 | 11:22 PM