దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Aug 15 , 2026 | 02:50 AM
కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. వారిని అన్నివిధాలా ఆదుకొంటున్నదన్నారు. శుక్రవారం కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి నియోజకవర్గంలోని 49 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను మంత్రి అందజేశారు.
మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి
బ్యాటరీ సైకిళ్లు, ఉపకరణాల పంపిణీ
హాజరైన ఎంపీ మాగుంట,
మారిటైం బోర్డు చైర్మన్ సత్య
కొండపి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. వారిని అన్నివిధాలా ఆదుకొంటున్నదన్నారు. శుక్రవారం కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి నియోజకవర్గంలోని 49 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను మంత్రి అందజేశారు. మరో 126 మందికి 207 ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మంత్రి స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశు ద్ధితో పనిచేస్తున్నదన్నారు. వారి జీవనోపాధికి, చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్న దన్నారు. దివ్యాంగశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించామన్నారు. త్వరలోనే దివ్యాంగుల శాఖ ద్వారా బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేస్తామ న్నారు. భవిష్యత్‌లో కూడా వారి ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధికి పలు పథకాల తోపాటు, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామ న్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొండపి నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు రూ.2.30కోట్ల మేర ఉపకరణాలను కేంద్రం పంపిణీ చేసిందన్నారు. తన వంతు సాయం దివ్యాంగులకు అందిస్తానన్నారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ దివ్యాంగులకు సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తారన్నారు. జేసీ కల్పనాకుమారి, దివ్యాంగుల శాఖ ఏడీ సువార్తమ్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు కొర్రపాటి వసంతరాయుడు పాల్గొన్నారు.