Share News

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:02 PM

అన్నదాతల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. మండలంలోని పాకల గ్రామంలో ఆదివారం నిర్వహించిన రైతుల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పాసు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి డాక్టర్‌ స్వామి

మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి

పాకలలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి

రైతులకు 1,547 పాసు పుస్తకాల పంపిణీ

సింగరాయకొండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. మండలంలోని పాకల గ్రామంలో ఆదివారం నిర్వహించిన రైతుల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గ్రామంలో 1,800 రైతుల ఖాతాలు ఉండగా అందులో 1,547 ఖాతాలను ఎటువంటి తప్పులు లేకుండా పరిష్కరించి రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏడాది రూ. 20వేలు పెట్టుబడి సాయం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్‌రెడ్డి పబ్లిసిటి పచ్చితో పాసుపుస్తకాలు, హద్దురాళపై తన బొమ్మవేసుకొని రూ.600 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కలు, గర్బకండ్రిక, గయాల్‌ భూములకు సంబంధించి భూమిపై ఉన్న రైతులకే పూర్తి యాజమాన్యపు హక్కును కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-2 నుంచి కృష్ణాజలాలను పాలేరుకి 0.6 టీఎంసీ, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ముసికి 0.6 టీఎంసీ నీటిని కేటాయించారన్నారు. అనంతరం రైతులకు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రవికుమార్‌, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు తహసీల్దార్‌ రాజేష్‌, ఎంపీడీవో వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, నేతలు షేక్‌ సందానీబాషా, పాకల మాజీ సర్పంచ్‌ సైకం చంద్రశేఖర్‌, బత్తుల రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


రైతుల ఫొటోలు, రాజముద్రతో పాస్‌పుస్తకాలే లక్ష్యం

జరుగుమల్లి (కొండపి), సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): వివాదాలు పరిష్కరించి భూయజమానుల ఫొటోలు, ప్రభుత్వ రాజముద్రతో పాస్‌ పుస్తకాలు ఇవ్వడమే లక్ష్యమని మంత్రి స్వామి చెప్పారు. జరుగుమల్లిలోని 850 మందికి, ఎడ్లూరుపాడు పరిధిలోని జేజీ కండ్రిగకు చెందిన 93 మంది రైతులకు రీసర్వే అనంతరం వచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. తహసీల్దార్‌ కొండపి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మీభూమి -మీ హక్కు సభలో ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవికుమార్‌, టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, కామేపల్లి పోలేరమ్మ ఆలయకమిటీ చైర్మన్‌ పోటు శ్రీనివాసమురళి, నాయకులు దగ్గుమాటి సుబ్బారెడ్డి, బలరామిరెడ్డి, పాతూరి కోటేశ్వరరావు, నరాల సోమయ్య, కొమ్మాలపాటి కృష్ణ, జరుగుమల్లి పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ నలమోతు వెంకటేశ్వర్లు, నందనవనం మాజీ సర్పంచ్‌ కోనూరి సుబ్బారావు, కోటా శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:02 PM