రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:32 PM
రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం కట్టుబడి ఉందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
గోళ్లపల్లిలో రైతన్నా మీకోసంలో ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం కట్టుబడి ఉందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రైతుల నుం చి నేరుగా కందులు కొనుగోలు చేసేందు కు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు నష్టపోకుండా ఉండేలా, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అనేక సంక్షేమ పథకాలు, సబ్సిడీలను కల్పిస్తున్నట్లు ఎరిక్షన్‌బాబు వివరించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సీసీ రోడ్డు ప్రారంభం
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గోళ్లపల్లి గ్రామంలో రామాలయం గుడి వద్ద రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రో డ్డును ఎరిక్షన్‌బాబు సోమవారం ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాలకు పండుగ కళ వచ్చిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గుంతల రోడ్లపై కనీసం గంపెడు మట్టిని కూడా పోయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు బాగుపడ్డాయన్నారు. పేదల సంక్షేమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎరిక్షన్‌బాబు తెలిపారు. కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు మేకల వలరాజు, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, గోళ్లపల్లి గ్రామ కమిటీ నెంబర్లు, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి సాగుపై దృష్టిసారించండి
రాచర్ల : రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారిస్తే అందుకు కావలసిన సూచనలు, సలహాలు తాము అందిస్తామని వ్యవసాయ శాఖ అఽఽధికారి షేక్ మహబూబ్‌బాషా అన్నారు. సోమవారం రాచర్ల తదితర గ్రామాల్లో రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించి పంటల సాగుపై రైతులతో మాట్లాడారు. తక్కువ పెట్టుబడి అధిక దిగుబడులపై దృష్టి సారించాలని, తాము కూడా రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. వ్యవసా య శాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులు లాభసాటిగా సాగు చేయాలన్నారు. ఏఏ ఈశ్వరి, రైతులు పాల్గొన్నారు.
పామూరు : భూమి ఉన్న ప్రతి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరశింహారావు తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్ర ఆదేశాల మేరకు మండలంలోని పడమరకట్టకిందపల్లి గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంను సోమవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని దానికి తగ్గ సూచనలు, సలహాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, యారవ శ్రీను, ఇన్‌చార్జి పీఏసీఎస్ బ్యాంకు డైరెక్టర్ ఉండేల పిచ్చిరెడ్డి, పువ్వాడి నాగరాజు, గట్ల కొండా రెడ్డి పాల్గొన్నారు.